తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

11
- Advertisement -

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని… ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్ట్ 10 క్రెస్టు గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,53,819 క్యూసెక్కుల వరద ప్రవాహం పెరిగింది.

Also Read:మురళి నాయక్..బయోపిక్

- Advertisement -