యుపీలో బీజేపీకి షాక్..

201
up
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జరిగిన చేదు అనుభవాన్ని మర్చిపోకముందే యుపీలో బీజేపీకి మరో షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగలగా అఖిలేష్ నాయకత్వంలో ఎస్పీ సత్తాచాటింది. సమాజ్‌వాదీ పార్టీ వారణాసి, అయోధ్యలో విజయాన్ని సాధించగా.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అజిత్ సింగ్ ఆర్ఎల్‌డీ మధురలో అగ్రస్థానంలో నిలిచాయి.

నాలుగేళ్ల ప‌ద‌వీకాలంలో యోగి ఈ మూడు జిల్లాల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం కనిపించలేదు. పీఎం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీలోని 40 స్థానాల్లో కేవ‌లం 8 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సమాజ్‌వాదీ పార్టీ 14 సీట్లు,బీఎస్పీకి 5 సీట్లు, అప్నాదళ్ (ఎస్) మూడు సీట్లు సాధించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం వారణాసిలో తన ఖాతాను తెరిచింది.

మధురలో బీఎస్పీ 12 సీట్లు, చౌదరి అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్‌ద‌ళ్ 9 సీట్లు గెలుచుకోగా బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. అయోధ్యలోని 40 స్థానాల్లో 24 స్థానాల‌ను ఎస్పీ కైవసం చేసుకుంది. బీజేపీ కేవ‌లం 6 సీట్ల‌ను మాత్ర‌మే గెలుచుకుంది.

3050 సీట్లలో కేవలం 700 సీట్లు సాధించింది బీజేపీ. 2400 సీట్లు సాధించిన ప్రతిపక్షాలు సాధించగా మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో 40 సీట్లలో కేవలం 10 సీట్లు మాత్రమే గెలిచింది బిజెపి. అయోధ్యలో 40 సీట్లలో కేవలం 6 సీట్లకు పరిమితం అయింది.

- Advertisement -