సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 59 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం నుండే ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్,బిహార్ సీఎం నితీశ్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 246లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిహార్ రాజ్ భవన్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ 326 లో ఓటు హక్కు వినియోగించుకున్నా బిహార్ సీఎం నితీశ్ కుమార్.
59 నియోజకవర్గాల్లోని 10,01,75,153ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరింపజేశారు. ఏడో విడతలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, సీని నటుడు శతృఘ్న సిన్హా, మాజీ స్పీకర్ మీరా కుమార్, అనురాగ్ ఠాకూర్, మనోజ్ సిన్హా వంటి ప్రముఖులు ఫోటీ పడుతున్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో రీపోలింగ్ కొనసాగుతోంది. పులివర్తిపల్లి, కుప్పంబాదు, రామచంద్రాపురం, ఎన్‌ఆర్ కమ్మపల్లి, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం,కాలేపల్లి గ్రామాల్లో గతంలో అవకతవకలు జరగడంతో మరోసారి పోలింగ్ జరుపుతున్నారు.