సందేశాన్నిచ్చే చిత్రంలో భాగమయ్యాం..

137
Romantic Criminals

యువతకు సందేశాన్నిచ్చే కథా కథనాలతో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన తాజా చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. రొమాంటిక్ క్రిమినల్స్ సినిమాలో నాయికగా నటించారు అవంతిక, మౌనిక. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో సినిమాలో నటించిన తమ అనుభవాలను ఈ తారలు తెలియజేశారు.

అవంతిక మాట్లాడుతూ…నేను గతంలో మూడు చిత్రాల్లో నటించాను. ఇది నాలుగో సినిమా. ఇందులో మత్తు పదార్థాలకు అలవాటైన ఏంజెల్ అనే యువతి పాత్రలో నటించాను. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేక, పిల్లల పట్ల శ్రద్ధ చూపకపోతే ఆ పిల్లలు ఎలా తయారవుతారు అనేది నా పాత్ర ద్వారా దర్శకులు చూపించారు. మత్తు మందులు మాని మంచిగా మారదామన్నా సమాజం మారనివ్వదు. చివరకు నా పాత్ర చనిపోతుంది. రొమాంటిక్ క్రిమినల్స్ మంచి సందేశాత్మక చిత్రం కాబట్టి ఇందులో నటించేందుకు నేనేమాత్రం సందేహించలేదు. ఇబ్బంది పడలేదు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు కథ చెప్పినప్పుడే సినిమా బాగుంటుంది అనిపించింది. ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. అని చెప్పింది.

మౌనిక మాట్లాడుతూ…మాది విశాఖపట్నం. అందాల పోటీల్లో పాల్గొన్న నన్ను చూసి సినిమా కోసం సంప్రదించారు దర్శకుడు. తొలి సినిమా మత్తు పదార్థాలకు అలవాటైన యువతి పాత్రలో నటించడం సరైనదేనా అనిపించింది. దర్శకుడు కథ వివరంగా చెప్పాక అంగీకరించాను. నీరజ అనే విద్యార్థినిగా ఈ సినిమాలో నటించాను. రొమాంటిక్ క్రిమినల్స్ మంచి సినిమా. అందరూ చూడాలి. అని చెప్పింది.