భారతీయ సాంప్రదాయాలు, విలువలు మరియు ఆదర్శాలను ప్రజలు విస్మరించేలా చేస్తూ దేశానికి విరుద్ధంగా కుట్రలు పన్నుతున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మనుస్మృతిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర సమరయోధుడు రాణా బేణీ మాధవ్ బక్ష్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడారు.
రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఇటీవల మహారాష్ట్రలో మాట్లాడుతూ ‘మహిళలు మనుస్మృతి సంకెళ్లను తెంచుకుని బయటకు రావాలి’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై దేశానికి పెద్దగా అంచనాలు లేవు. కానీ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్యానికి జవాబుదారీగా ఉండాలి. భారత సాంప్రదాయాలు, సంస్కృతిని విమర్శించడం మీ జన్మహక్కుగా భావిస్తున్నారా?” అని యోగి ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ బయటకు వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని, విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా దేశం పోరాడుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.సాంస్కృతిక వారసత్వంపై అవగాహన:”కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించింది. మను, రాముడు లేదా భారత సాంస్కృతిక వారసత్వం గురించి తెలుసుకోవాలనుకుంటే అధర్వవేదం, శతపథ బ్రాహ్మణం మరియు మత్స్య పురాణాలను చదవాలి అని సూచించారు.
Also Read:ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’
సరిహద్దుల్లో సైనికులు శత్రువులతో పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు సైనికుల శౌర్యానికి ఆధారాలు అడుగుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

