ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మూడు ముళ్లకు కూడా రిజిస్ట్రేషన్‌తో ముడిపెడుతోంది. బండ్లు, ఇండ్లు లెక్కనే పెండ్లిని కూడా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రూల్స్ పెట్టింది యూపీ ప్రభుత్వం. జనన, మరణ రిజిస్ట్రేషన్లకు ఎట్ల నమోదు చేస్తున్నరో పెండ్లీల రిజిస్ట్రేషన్లను కూడా అలాగే నమోదు చేయాలని యోగీ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది. వివాహా నమోదు ప్రక్రియ జరగకుంటే చట్టం దృష్టిలో పెళ్లి కానట్టే లెక్క.. కుల,మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారెజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఈ మేరకు మంగళవారం యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కెబినేట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
అయితే దేశ వ్యాప్తంగా పెళ్లి రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా చేయాలని 2006లోనే సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా యూపీతో పాటు రెండు రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలవుతోంది. 11 ఏళ్ల తర్వాత యూపీ ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్-2017 పేరిట నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఏడాదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే రోజుకు రూ.10, ఆపై ఆలస్యం చేస్తే రూ.50ల చొప్పున పెరుగుతూ పోతుందని తెలిపింది.
అయితే ముస్లిం పెళ్లికొడుకు, పెళ్లికూతుళ్ల ఫోటోలకు మినహాయింపు ఇవ్వాలని కొందరు ముస్లింలు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ అభ్యర్థనను యూపీ ప్రభుత్వం తిరస్కరించిందని యూపీ వైద్య శాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.