భారత్ లో హిందువులు మైనార్టీలుగా మారకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఐదుగురు పిల్లలని కనాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అప్పుడే హిందుత్వాన్ని సజీవంగా ఉంచగలమని చెప్పారు. పిల్లలకు జన్మనివ్వడం అనేది దేవుడిచ్చిన ప్రసాదమని పేర్కొన్నారు. దేశంలోని సాధులు, ఆధ్యాత్మిక గురువులు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు.
ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతి హిందువు జంట ఐదుగురు పిల్లలని కనాలి.. వీరిలో ఇద్దరు మొగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉండాలని. మిగతా ఒక్కరు అబ్బాయా..? అమ్మాయా..? అనేది తల్లిదండ్రుల ఇష్టం అన్నారు. అప్పడే దేశంలో హిందుత్వం సజీవంగా ఉంటుంది. లేదంటే మైనార్టీలుగా మారిపోతారని అన్నారు.
హిందువులు అధికంగా ఉంటేనే భారత్ బలంగా ఉంటుందని, లేదంటే బలహీనంగా మారిపోతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రతి హిందువు ఆలోచించుకోవాలని సూచించారు. భారత్ మాతాకీ జై అని అనని వారంతా పాకిస్తానీయులే అని గతంలో ఆయన వ్యాఖ్యానించారు.