సైరాలో నిహారిక..

191
-niharikakonidela
- Advertisement -

స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ సైరా నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Niharika to act in Sye Raa

పెద్దనాన్న సినిమాలో నటించాలని.. నిహారిక ఎప్పటినుంచో ముచ్చటపడుతోంది. తాజాగా సైరా సినిమాతో ఆ ముచ్చట తీరనుందా..? అంటే అవుననే అంటున్నారు. ఈ సినిమాలో గిరిజన యువతిగా నిహారిక కనిపించనున్నట్లు చెబుతున్నారు. కేవలం మూడు సీన్లలో కనిపంచనున్నారని టాక్. చిరంజీవి సినిమాలో నటించాలని ఉందని గతంలో నిహారిక పలుమార్లు చెప్పారు. ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్ కారణంగానే ఈసినిమాలో అవకాశం వచ్చేలా చేసిందని చెబుతున్నారు. మొత్తానికి పెద్దనాన్నతో కలిసి నటించాలనే ముచ్చట నిహారిక ఈ సినిమాతో తీర్చేసుకుంటుంది.

చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ నయతార నటిస్తోంది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో సుదీప్ లు ముఖ్యపాత్రలలో నటించనున్నారు.

- Advertisement -