అన్‌స్టాపబుల్..సల్మాన్‌ తర్వాతే పెళ్లి!

39
- Advertisement -

బాలయ్య హోస్ట్‌గా ఆహాలో ప్రసారమవుతున్న షో అన్‌స్టాపబుల్ 2. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపిచంద్ ఇద్దరు ఈ షోకి రాగా ఫుల్ ఎపిసోడ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే పలు ప్రొమోలతో ఉరిస్తూ వచ్చిన నిర్వాహకులు తాజాగా మరో ప్రొమో రిలీజ్ చేసి అంచనాలను మరింత పెంచేశారు.

ఈ ప్రోమో ఆద్యంతం ఫుల్ ఎనర్జీతో సాగింది. ఇటీవల శర్వానంద్ ఈ షోకి వచ్చినప్పుడు పెళ్లి ఎప్పుడు అంటే, ప్రభాస్ చేసుకున్న తరువాత అన్నాడు.. మరి నీ పెళ్లి ఎప్పుడు అని బాలయ్య అడగ్గా సల్మాన్ ఖాన్ చేసుకున్న తరువాత అని చెప్పాల్సి వస్తుందేమో అని సరదాగా తెలిపారు ప్రభాస్.

ప్రభాస్ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏమిటి అని బాలయ్య అడగ్గా.. ఏమీ లేవన్నట్లుగా పాస్ బటన్ నొక్కాడు. తర్వాత రామ్ చరణ్‌తో బాలయ్య ఫోన్‌లో ప్రభాస్‌కు సంబంధించి ఏదో విషయాన్ని అడిగి తెలుసుకుంటుండగా….ఒరేయ్ చరణ్.. నువ్వు నా ఫ్రెండా, శత్రువా అంటూ ప్రభాస్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. తర్వాత గోపిచంద్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగి తొలి సినిమా చేదు అనుభవంతో బౌన్స్‌బ్యాక్ అయ్యావంటూ కొనియాడారు బాలయ్య.

ఇవి కూడా చదవండి..

- Advertisement -