విజయ్ ఏం చేస్తున్నట్లు ?

29
- Advertisement -

తక్కువ టైంలో సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి తో స్టార్ హీరోల పక్కన చోటు సంపాదించుకొని యూత్ ఐకాన్ అనిపించుకున్న విజయ్ దేవరకొండ. ప్రెజెంట్ విజయ్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. ఒకదాని తర్వాత మరొకటి అన్ని అపజయాలే తగులుతున్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్ కి సరైన హిట్ పడలేదు. మధ్యలో కొందరు దర్శకులతో ప్లాన్ చేసుకున్నప్పటికీ అవి తేడా కొట్టాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ కూడా తుస్సుమంది. ఇక పూరి తనకి రామ్ లా ఓ సాలిడ్ హిట్ అందిస్తాడని ‘లైగర్’ సినిమా చేస్తే అది విజయ్ కెరీర్ గ్రాఫ్ ను అమాంతంగా కిందకి పడేసింది.

ప్రస్తుతం విజయ్ ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. సమంత హెల్త్ ఇష్యూ కారణం చేత ఆ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇంకా చాలా షూట్ బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ సెట్స్ పైకి వచ్చేదే ఎప్పుడనే క్వశ్చన్ కి ఆన్సర్ దొరకడం లేదు. సుకుమార్ చేయాల్సిన సినిమా అటకెక్కింది. ఇటివలే గౌతం తిన్ననూరి ఓ పాయింట్ చెప్పాడు. ఇంకా ఫైనల్ నెరేషన్ అవ్వలేదు. ప్రస్తుతం దొరికిన గ్యాప్ ను సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ తో గడుపుతున్నాడు విజయ్.

లైగర్ ఫ్లాప్ నుండి త్వరగా బయట పడి విజయ్ ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్ళీ కెరటంలా దూసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది విజయ్ నెక్స్ట్ సినిమాల సంగతి పూర్తిగా తెలియనుంది.

ఇవి కూడా చదవండి….

సినిమాల పరంగా ‘చిరు’త వేగం

రవితేజతో నా డ్రీమ్ ప్రాజెక్ట్‌ :త్రినాథ

వాల్తేరు…నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి

- Advertisement -