ఒకే కథతో రెండు సినిమాలు ?

168
- Advertisement -

రవితేజ హీరోగా రాబోతున్న ధమాకా సినిమాకు , విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధమ్కీ’ సినిమాకు పోలికలు ఉన్నాయని , ఒకే కథతో రెండు సినిమాలు రాబోతున్నాయని ఓ కామెంట్ వినిపిస్తుంది. ఈ రెండు సినిమాలకు కథ -స్క్రీన్ ప్లే అందించింది ప్రసన్న బెజవాడ కావడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. నిజానికి ధమాకా లో అలాగే ధమ్కీ లో హీరోలు డబుల్ రోల్. ఒక ఒకటి మాస్ , ఇంకొకటి క్లాస్.

విశ్వక్ సేన్ ధమ్కీ లో అలాగే ధమాకా లో కథ పరమగా చాలా సిమిలారిటీస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ధమాకా ట్రైలర్ చూసాక ప్రసన్న ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే సినిమా చూపిస్తా మామ , నేను లోకల్ , హలో గురించి ప్రేమకోసమే ఇలా మూడు సినిమాలకు ఒకే ఒకే కథ అందించాడనే కామెంట్ ప్రసన్న పై ఉంది.

తాజాగా ఇప్పుడు ధమాకా , ధమ్కీ సినిమాలకు ఈ యంగ్ రైటర్ ఒకే కథతో రెండు వర్షన్స్ ఇచ్చాడా ? అనే సందేహాలు వస్తున్నాయి. ఏదేమైనా రెండు సినిమాలకు సంబంధించి ట్రైలర్స్ మాత్రమే వచ్చాయి. ఇంకా సినిమాలు రిలీజ్ అవ్వలేదు. సో సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాక కానీ సేం కథ అనే సంగతి తెలియదు. ఇప్పటి వరకూ ప్రసన్న కి ట్రోలింగ్ తప్పదు.

ఇవి కూడా చదవండి…

#NBK108… శరత్ కుమార్

వాల్తేరు…నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి

రవితేజతో నా డ్రీమ్ ప్రాజెక్ట్‌ :త్రినాథ

- Advertisement -