బాలయ్య ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’ కొత్త రంగు పూసుకోబోతుంది. ముఖ్యంగా తర్వాత ఎపిసోడ్ తాలూకు గెస్టు ల విషయంలోనే క్రేజీ రూమర్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏమిటంటే..బాలకృష్ణ టాక్ షో “అన్ స్టాపబుల్” కి సినిమా విజ్ఞానాన్ని అద్దబోతున్నారు. ముఖ్యంగా ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి అవసరమయ్యే బోలెడంత కంటెంట్ ను తర్వాత వచ్చే ఎపిసోడ్ లో పరిచయం చేయబోతున్నారు. ఇందుకోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు.
ఈ ఎపిసోడ్ కి డి.సురేష్ బాబు.. అగ్ర నిర్మాత `ఆహా` అధినేత అల్లు అరవింద్… లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గెస్టులుగా వస్తుండటం విశేషం. ముఖ్యంగా వీరంతా నేటితరం ఫిలింమేకర్స్ కి అవసరమైన విలువైన సమాచారాన్ని చర్చించబోతున్నారు. ఏది ఏమైనా ఈ షోకి సంబంధించి రోజుకొక ఓ వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. తాజాగా విజ్ఞాన ఎపిసోడ్ అంటూ మరో వార్త వైరల్ అవుతుంది.
అయితే, ఈ వార్త నిజమే. కాకపోతే ఎన్నో ఎపిసోడ్ గా రిలీజ్ అవుతుందో తెలియదు. మొత్తానికి ఎంటర్ టైన్మెంట్ టార్గెట్ గా స్టార్ట్ అయిన బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రాజకీయ రంగుతో పాటు కొత్త తరానికి విద్యను నేర్పే ప్లాట్ ఫామ్ గానూ టర్న్ తీసుకోవడం మంచి పరిణామమే. మొత్తమ్మీద బాలయ్య ఏం చేసినా సంచలనమే.
ఇవి కూడా చదవండి….
బైరాన్ పల్లి చిత్రం చాలా బాగుంది..
ఏడాదికో సినిమా… రాజమౌళి డిమాండ్
డిజాస్టర్ రీ రిలీజ్ కోసం రజినీ కష్టాలు