అన్‌స్టాపబుల్..బాలయ్యతో ఆది పురుష్!

230
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. ఇక ఇటీవలె సెకండ్ సీజన్ ప్రారంభం కాగా ఫస్ట్ సీజన్‌ కంటే ఎక్కువ రేటింగ్‌తో దూసుకుపోతోంది.

తాజాగా సెకండ్ సీజన్‌ లెటేస్ట్ ఎపిసోడ్‌కి అతిథిగా రానున్నారు ఆదిపురుష్ ప్రభాస్. దీనిపై ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ, ప్రభాస్ కి సంబంధించి ఒక వీడియో చేసి బాలయ్య షోకి ప్రభాస్ రానున్నదని తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

త్వరలోనే బాలయ్యతో ప్రభాస్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసి న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తారని సమాచారం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -