భారత జనాభాపై ఐరాసా కీలక నివేదిక

8
- Advertisement -

భారతదేశంలో ఫర్టిలీటిపై ఐక్యరాజ్యసమితి కీలక నివేదిక వెల్లడించింది. 2025 సంవ‌త్స‌రంలో భార‌త దేశ జ‌నాభా 146 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ఓ నివేదిక రిలీజ్ చేసింది. యూఎన్ఎఫ్‌పీఏ 2025 స్టేట్ ఆఫ్ వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ రిపోర్టులో ఈ విష‌యాన్ని తెలిపారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం ఫెర్టిలిటీ లక్ష్యాల‌ను అందుకోవ‌డం లేద‌ని ఆ రిపోర్టులో చెప్పారు.

బ‌ర్త్ రేట్ స్లోగానే ఉన్నా.. దేశంలో యువత జ‌నాభా బాగానే ఉన్న‌ట్లు పేర్కొన్నారు. 0 నుంచి 14 ఏళ్ల వారి సంఖ్య 24 శాతంగా, 10 నుంచి 19 ఏళ్ల వారి సంఖ్య 17 శాతంగా, 19 నుంచి 24 వ‌ర‌కు 26 శాతంగా ఉన్న‌ట్లు తేల్చారు. 15 నుంచి 64 ఏళ్ల వ‌ర్కింగ్ గ్రూపులో ఉన్న‌వారి సంఖ్య 68 శాతంగా ఉన్న‌ట్లు తెలిసింది.

2025లో పుట్టిన వారి జీవ‌న కాల అంశాన్ని నిర్దారించారు. స‌గ‌టున మ‌గ‌వాళ్లు 71 ఏళ్లు, ఆడ‌వాళ్లు 74 ఏళ్లు బ్ర‌తికే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేశారు. భార‌త జ‌నాభా త్వ‌ర‌లో 150 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని, ఆ త‌ర్వాత 170 కోట్ల వ‌ర‌కు వెళ్తుంద‌ని, అయితే మ‌రో 40 ఏళ్ల‌లో ఆ జ‌నాభా త‌రుగుద‌ల స్టార్ట్ అవుతుంద‌ని రిపోర్టులో పేర్కొన్నారు.

Also Read:రాహుల్‌తో రేవంత్ భేటీ..

- Advertisement -