- Advertisement -
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది.
కొత్తగా రాష్ట్ర మంత్రివర్గంలోకి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేరిన విషయం తెలిసిందే. వీరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు?.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సీఎం దగ్గర శాఖలు కేటాయిస్తారా?. ఇతర మంత్రులకు తగ్గించి.. ఈ ముగ్గురికి కేటాయిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.
Also Read:బాలయ్య క్షమాపణాలు చెప్పాలి:రోజా
- Advertisement -

