వ్యాక్సిన్ వచ్చినా కష్టమే: ఐరాస

201
uno
- Advertisement -

కోనా వ్యాక్సిన్ పై పోరులో రోజుకో శుభవార్త అందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు చేస్తున్న ట్రయల్స్ సత్ఫలితాలనిస్తుండగా మూడో దశ ట్రయల్స్‌ సక్సెస్ అయితే వ్యాక్సిన్‌ మరికొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది.

అయితే వ్యాక్సిన్ వచ్చినా కరోనాకు అడ్డుకట్టవేయడం అంత సులభం కాదని ఐరాసా అభిప్రాయపడింది.అయితే, టీకా అందుబాటులోకి వచ్చినా మహమ్మారిని కట్టడి చేయడం కష్టం అని, అలా భావించడం పిచ్చితనమే అవుతుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు నిబద్దతతో పోరాటం చేస్తున్నారని….కరోనా మహమ్మారి దశాబ్దాలపాటు కొనసాగుతుందని అన్నారు. యూకే ప్రభుత్వం ఫైజర్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఐరాసా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -