దేశంలో 24 గంటల్లో 36,594 కరోనా కేసులు..

89
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96 లక్షలకు చేరువయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో 36,594 కరోనా కేసులు నమోదుకాగా 540 మంది మృతిచెందారు. దీంతో దేశ‌ంలో మొత్తం వైర‌స్ కేసుల సంఖ్య 95,71,559కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,16,082 యాక్టివ్ కేసులుండగా 90,16,289 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 1,39,188కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో 42,916 మంది డిశ్చార్జ్ అయ్యారు.