- Advertisement -
కరోనా లాక్డౌన్ తరువాత కేంద్రం దశలవారిగా నిబంధనల్లో సడలింపులు ఇస్తు వస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెల ముగుస్తుండటంతో ఈసారి నిబంధనల్లో మరిన్ని మార్పులు చేస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దశలవారీ లాక్ డౌన్ ఎత్తివేత పై సెప్టెంబర్ 30న ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.
కంటైన్ మెంట్ జోన్లలో నవంబర్ 30వరకు లాక్ డౌన్ పొడిగింపు. కొన్ని కార్యకలాపాలకు సంబంధించి కరోనా వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని అంచనా వేయాలి. కేంద్ర ప్రామాణిక నిబంధనలకు లోబడి వాటి పున: ప్రారంభంపై నిర్ణయాలు తీసుకోవాలని అనుమతి ఇచ్చింది కేంద్రం. కంటైన్ మెంట్ జోన్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించకూడదని కేంద్రం స్పష్టం చేసింది.
- Advertisement -