దుబ్బాక వార్డుల్లో సీసీరోడ్ల నిర్మాణం చేపడతాం:హరీష్ రావు

178
harishrao

దుబ్బాక నియోజకవర్గం పరిధిలో పెండింగ్ పనులపై అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికరులతో ఇవాళ సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో మీడియాతో మాట్లాడిన హరీష్….దుబ్బాక నియోజకవర్గం కు 3 వేల రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందిన్నారు.

వాటిలో 800 ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని… మిగిలిన చిన్న చిన్న పనులను 15 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అతి త్వరలో లబ్దిదారులకు రెండు పడక గదుల ఇండ్ల ను పంపిణీ చేస్తాం … దుబ్బాక పట్టణ అభివృద్ధికి ముఖ్య మంత్రి ప్రత్యేకంగా10 కోట్ల నిధులను మంజూరు చేశారని చెప్పారు.

పట్టణంలో 4 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టామని…పట్టణంలోని 20 వార్డులలో మురుగు కాల్వలు, సిసి రోడ్ల నిర్మాణం చేపడతాం అన్నారు. పట్టణంలో కోటి రూపాయలతో గ్రంధాలయ నిర్మాణం … ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తాం అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు జలాలు ప్రతి ఎకరాకు అందేలా పిల్ల కాల్వల భూ సేకరణ, నిర్మాణం వేగంగా చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాం అన్నారు. కాల్వల భూ సేకరణ వేగంగా జరిగేలా సహకరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులను కోరాం …. దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం ను పక్షం రోజుల్లో ప్రారంభిస్తాం అన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నీ స్వయంగా కలిసి ఆహ్వానిస్తాం అని చెప్పారు.