అన్ లాక్ 3.0 గైడ్ లైన్స్ ఇవే..

401
unlock
- Advertisement -

జూలై 31తో లాక్ డౌన్ 2.0 గడువు ముగుస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ 3.0 గైడ్ లైన్స్ విడుదల చేసింది కేంద్ర హోంశాఖ.ఆగస్టు 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్ అమలవుతుందని…స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

కంటైన్‌మెంట్ జోన్లలో తప్ప మిగితా చోట్ల కర్ఫ్యూ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ములు తెరిచేందుకు అనుమతిచ్చి న కేంద్రం….సినిమా హాళ్లు, థియేటర్లు, బార్లు, స్విమ్మింగ్ పూళ్లు, ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

అంతర్జాతీయ విమానయానంపై కూడా నిషేధం కొనసాగుతుందని…హోంశాఖ అనుమతించిన సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపింది. మెట్రో రైళ్లపైనా నిషేధం కొనసాగుతుందని…రాజకీయ, క్రీడా, వినోత, విద్యా, సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక వేడుకలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగనుంది.

సోషల్ డిస్టెన్స్ నిబంధనలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు….ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులకు తగ్గట్టు స్థానికంగా అదనపు ఆంక్షలు విధించే అధికారం రాష్ట్రాలకే ఇచ్చింది. శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపులో కోవిడ్-19 ఆరోగ్య సూత్రాలు వర్తిస్తాయని…కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను సడలించే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపింది.నిబంధనలు ఉల్లంఘించేవారికి పరిహారం, చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపింది.

- Advertisement -