దేశంలో కొత్త విద్యావిధానానికి కేంద్రం అమోదం..

394
modi
- Advertisement -

దేశంలో సరికొత్త విద్యావిధానికి కేంద్రం అమోదం తెలిపింది. 3 ఏళ్ల తర్వాత విద్యావిధానం మార్పులు తెనుండగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు తెలుస్తోంది. 5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి రానున్నట్టు సమాచారం. 3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

వృత్తి, ఉపాధి లభించే విధంగా విద్యా వ్యవస్థను మార్చనున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా పరిగణిస్తారని సమాచారం. ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -