- Advertisement -
ప్రపంచ దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. అమెరికా, యూరప్, బ్రెజిల్ దేశాల్లో కరోనా మహమ్మారి ఉదృతి తగ్గడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసుల సంఖ్య నమోదవుతుండగా గత 24 గంటల్లో 2,879 మంది మృతి చెందారు.
గత 24 గంటల్లో ప్రపంచం మొత్తం మీద 3.66 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 12,581 మంది కరోనాతో మృతి చెందారు. అమెరికా తరువాత రోజువారీ పాజిటివ్ కేసుల విషయంలో బ్రెజిల్, బ్రిటన్ దేశాలు ఉన్నాయి.
కరోనా వైరస్ తొలిసారి కనిపించిన చైనాలోని వుహాన్లో డిసెంబర్ 2019 కంటే ముందు కొవిడ్ వ్యాప్తి చెందినట్లుగా తగిన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందం తేల్చింది. డిసెంబర్ 2019 కంటే ముందు సార్స్-కొవ్-2 వైరస్ సిటీలో వ్యాప్తి చెందినట్లుగా చెప్పడానికి తగిన ఆధారాలు లేవని చైనా టీమ్ హెడ్ లియాంగ్ వానియన్ చెప్పారు.
- Advertisement -