లాక్‌డౌన్‌లో అనవసరంగా రోడ్లపైకి రావొద్దు: కిషన్ రెడ్డి

114
kishan reddy
- Advertisement -

లాక్‌ డౌన్‌లో అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ప్రజలకు సూచించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి… కరోనాతో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు.

అంపోటరిస్ అనే ఇంజక్షన్‌లు కొరత ఏర్పడిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయన్నారు. ఈనెల 31వతేదీలోపు మూడు లక్షల ఇంజెక్షన్లు ఉత్పత్తి అవుతాయని, విదేశాల నుంచి జూన్ మొదటి వారంలో రెండు లక్షల ఇంజెక్షన్లు అందుబాటులో వస్తాయని ఆయన చెప్పారు.

70 శాతం యువకులు కోవిడ్ భారిన పడుతున్నారని, తమికేమీ కాదనే నిర్లక్ష్యాన్ని వదిలి పెట్టాలన్నారు. మన దేశంలో 16 కంపెనీలలో వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని, తెలంగాణలో మూడు కంపెనీల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు.

- Advertisement -