కాంగ్రెస్ నేతలపై రైతుల తిరుగుబాటు…

37
congress

వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళన దిగేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలకు రైతులు బుద్దిచెప్పారు. వ‌రి క‌ల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ వ‌ద్ద దీక్ష‌ల పేరుతో డ్రామాలు ఆడేందుకు ప్ర‌య‌త్నించగా వారిపై రైతులు తిరుగుబాటు చేశారు.

కొత్త‌కోట మండ‌లం రామ‌కృష్ణాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద దీక్ష చేప‌ట్టేందుకు కాంగ్రెస్ నేత‌లు సిద్ధ‌ంకాగా ఈ దీక్ష‌ను రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో ఈ మాదిరిగా ధాన్యం కొనుగోళ్లు చేసి ఉంటే బాగుండు అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు మేలు జరుగుతుందని స్పష్టం చేయడంతో అక్కడి నుండి జారుకున్నారు కాంగ్రెస్ నేతలు.

ప్ర‌భుత్వం చివ‌రి గింజ వ‌ర‌కు కొనుగోలు చేస్తున్న‌ద‌ని, ప్ర‌స్తుతం ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ అద్భుతంగా కొన‌సాగుతోంద‌ని రైతులు పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, రైతు వేదిక‌ల‌తో పాటు అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఈ ప్ర‌భుత్వం ఉంద‌న్నారు.