ఆరో రోజు రైతు కూలీలకు అన్నదాన కార్యక్రమం..

28
mp

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుంబిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ మార్కెట్ కార్యాలయం యందు రైతు కూలీలందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమం ఆరవ రోజుకు చేరగా ఇవాళ మూడవ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోయినిపల్లి జెడ్పిటిసి కత్తెర పాక ఉమా కొండయ్య , కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలిపాక మల్లికార్జున్ , పూరేళ్ల సరోజ , చాట్లపల్లి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.