కరోనా యోధులను అవమానపర్చారు:రాందేవ్‌పై కేంద్రం ఫైర్

57
baba ramdev

యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. కరోనా కంటే అల్లోపతి వంటి ఆధునిక చికిత్స వైద్య విధానాలే ప్రజలను బలిగొంటున్నాయని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా డాక్టర్స్‌తో పాటు కేంద్రం కూడా రాందేవ్‌ వ్యాఖ్యలను తప్పు బట్టింది.

రాందేవ్ వ్యాఖ్యలు వైద్యుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, రామ్ దేవ్ బాబా కు లీగ్‌ల్ నోటీసులు పంపాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) కేంద్రాన్ని కోరగా ఈ మేరకు బాబాకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్.

రాందేవ్ లిఖితపూర్వక క్షమాపణ తో పాటు మరియు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతూ లే డా. హర్షవర్ధన్ ఖ రాశారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న వైద్యులపై ఆయన చేసిన ప్రకటన కరోనా యోధులను అగౌరవపరిచిందని, దేశ మనోభావాలను దెబ్బతీసిందని విచారం వ్యక్తం చేశారు. మరి దీనిపై రాందేవ్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.