యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ యూపీఎస్సీ-2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలను తాజాగా విడుదల చేశారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 933మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. ఆల్ ఇండియా మొదటి ర్యాంక్‌ను ఇషితా కిశోర్ సాధించారు. రెండవ ర్యాంకు గరిమాలోహీ, ఉమ హరతి, స్మృతి మిశ్రా వరుసగా ర్యాంకులు సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంకు వచ్చింది.
ప్రిలిమ్స్‌ను జూన్5,2022న ప్రాథమిక పరీక్షలను నిర్వహించారు. తదుపరి మెయిన్స్ సెప్టెంబర్ 16 నుంచి 25వరకు నిర్వహించగా…డిసెంబర్ 6న మెయిన్స్ ఫలితాలు వెల్లడించారు. కాగా ఫైనల్ సెషన్ అయిన ఇంటర్వ్యూలను మే 18నుంచి నిర్వహించగా…తాజాగా ఫైనల్ రిజల్ట్స్ వెలువడ్డాయి. కాగా 2023 యూపీఎస్సీ-2023 ని ప్రిలిమ్స్‌ను మే28న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. హల్‌టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు.
Also Read: రూ.2వేల నోటు..ఆర్బీఐ మరో కీలక ప్రకటన