కేంద్ర మంత్రులకు తప్పిన పెను ప్రమాదం

1
- Advertisement -

విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్ కు వెళ్తున్న కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది.షీలానగర్ జంక్షన్ వద్ద కాన్వాయ్ ఒకదానికొకటి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో కాన్వాయ్ లోని కార్లన్ని ఒకదానికి ఒకటి ఢీకొట్టాయి. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న కేంద్ర ఉక్కు మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ప్లాంట్ ను సందర్శిస్తుస్తుండటంతో భారీగా పార్టీ నేతలు, అభిమానులు తరలివచ్చారు.కాన్వాయ్ లో దెబ్బతిన్న మూడు కార్లలో మాజీ ఎంపీ జివీఏల్ కారు కూడా ఉన్నట్టు సమాచారం.

Also Read:డొనాల్డ్ ట్రంప్‌ దావా.. రూ.216 కోట్లు!

- Advertisement -