విశాఖలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..

38

దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా వైరస్ వ్యాప్తిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ విశాఖలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నాలుగుకు చేరాయి. ఈనెల 15వ తేదిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుండి విశాఖ వచ్చాడు. అయితే ఇతనికి టెస్ట్‌లు చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓ ప్రైవేటు హస్పటల్‌లో చికిత్స తీసుకుని నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యాడు. అనంతరం ఆ వ్యక్తి అధికారులు అబ్జర్వేషన్‌లో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. నిబంధనలు ప్రకారం ఎయిర్ పోర్ట్‌లో తీసిన శాంపిల్స్‌ను హైదరాబాద్ సీసీఎంబీ కి పంపడంతో ఒమిక్రాన్‌గా నిర్థారణ అయ్యింది.