సింగరేణికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రశంసలు..

279
Union Minister Pralhad Joshi
- Advertisement -

కరోనా పరిస్థితులను విజయవంతంగా అధిగమించి బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభల్లో రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌, పేస్ బుక్ ఖాతాలలో సింగరేణి పురోగతిపై ప్రత్యేకంగా పోస్ట్ చేసి అభినందించారు. అలాగే సింగరేణి సాధించిన ప్రగతికి సంబంధించిన చిన్న వీడియోను కూడా తన ట్విట్టర్‌, పేస్ బుక్ ఖాతాలలో పొందుపరచడం విశేషం.

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే సింగరేణి 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ.8180 వేల కోట్లకు పైగా టర్నోవర్‌ తో 72 శాతం వృద్ధిని సాధించడం, 364 శాతం వృద్ధితో 800 కోట్ల లాభాలను ఆర్జించడంపై కంపెనీకి ప్రహ్లాద్‌ జోషి అభినందనలు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కంపెనీ గణనీయమైన ప్రగతి సాధించడంలో కీలక పాత్ర పోషించిన కంపెనీ నాయకత్వాన్ని, ఉద్యోగులను ప్రత్యేకంగా ప్రశంసించారు. రానున్న రోజుల్లోనూ ఇదే పురోగతిని కొనసాగిస్తూ దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో ముఖ్య భూమిక పోషించాలని మంత్రి ప్రహ్లాద్‌ జోషి అభిలషించారు.

- Advertisement -