డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్‌: కిషన్ రెడ్డి

43
kishan reddy

దేశంలో డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. లాక్ డౌన్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సహాయము చేయాలన్నారు.

రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలి… కరోనాతో చనిపోయిన,సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారందరికి పీఎం భీమా యోజన అందుతుందన్నారు.

వ్యాక్సిన్ కు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని…… మీ సమీప వాక్సిన్ సెంటర్ లో ఆధార కార్డుతో వెళ్తే వాక్సిన్ వేస్తారని చెప్పారు.