మొక్కలు నాటిన సర్పంచ్ చేతన విజయ్‌ రెడ్డి..

46

తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం కలిగొట్ గ్రామం సర్పంచ్ చేతన విజయ్ రెడ్డి. రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఇది అద్భుతమైన కార్యక్రమం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.