మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీకి కసరత్తు..!

97
nirmala
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజుకు రికార్డు స్ధాయిలో లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతుండగా మ‌రో ఆర్థిక ఉద్దీప‌న ప్యాకేజ్ ప్ర‌క‌టించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

మ‌హ‌మ్మారి కార‌ణంగా జీవ‌నోపాధి దెబ్బ‌తినే వారందరికీ ఊత‌మిచ్చేలా ఈ ప్యాకేజీని తీసుకురానున్నారు.ఈ ప్యాకేజ్‌పై ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివిధ వ‌ర్గాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ‌, ఇత‌ర మంత్రిత్వ శాఖ‌లు ప్యాకేజ్ ను ఎప్పుడు ప్ర‌క‌టించాలి..ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే దానిపై క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి. ఇక క‌రోనా క‌ట్ట‌డికి ఈసారి దేశ‌వ్యాప్త లాక్డౌన్ ఉండ‌బోద‌ని, అయితే క‌ఠిన నియంత్ర‌ణ‌లు అమ‌ల‌వుతాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

గ‌త ఏడాది క‌రోనా క‌ట్ట‌డికి మార్చి 26 నుంచి మే 17 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా లాక్డౌన్ విధించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ఉప‌శ‌మన చ‌ర్య‌ల‌తో రూ 20.97 ల‌క్ష‌ల కోట్ల ఉద్దీప‌న ప్యాకేజ్ ను ప్ర‌క‌టించింది.

- Advertisement -