సైబర్ దాడులతో ముప్పులేదు: కేంద్రం

118
cyber attack
- Advertisement -

సైబర్ దాడులతో కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఈ-మెయిల్స్‌కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది కేంద్రం. ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డొమినోస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఈ-మెయిల్స్‌, పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల బారినపడినట్లు వచ్చిన వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది.

నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) పర్యవేక్షించే ఈ-మెయిల్‌ వ్యవస్థ సురక్షితంగా ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ-మెయిల్‌ వ్యవస్థ అత్యంత సురక్షితమైందని వెల్లడించింది.ఎన్‌ఐసీ ఈ-మెయిల్‌ పాస్‌వర్డ్‌లో ఏదైనా మార్పునకు మొబైల్‌ ఓటీపీ అవసరమని, ఓటీపీ తప్పుగా ఉంటే పాస్‌వర్డ్‌ మార్పు సాధ్యం కాదని చెప్పింది.

ఇతర వెబ్‌సైట్లపై జరిగే సైబర్‌ దాడులు ప్రభుత్వ ఈ-మెయిల్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపవని చెప్పింది. ఆయా వెబ్‌సైట్లలో నమోదు చేసుకున్న ఈ-మెయిల్‌, ప్రభుత్వ ఈ-మెయిల్‌ అకౌంట్లు పాస్‌వర్డ్‌లు ఒకటే అయినప్పుడు మాత్రమే ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపింది.

- Advertisement -