దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. వరుసగా ఏడో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. 10 లక్షలకు దిగువన యాక్టీవ్ కేసుల సంఖ్య ఉంది. అయితే కరోనా బాధిత మరణాలు ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య 72 రోజుల తర్వాత 71 వేల దిగువకు చేరింది. గడచిన 24 గంటల్లో 70,421 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దాని ప్రకారం… గడచిన 24 గంటల్లో 1,19,501 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కు చేరింది. మరో 3,921 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,74,305కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,81,62,947 మంది కోలుకున్నారు. 9,73,158 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశవ్యాప్తంగా 95.43% రికవరీ రేటు, 1.27% మరణాల రేటు ఉంది.

