కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం..

33

బుధవారం ఉదయం 11గం.లకు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ భేటీలో మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపనున్నది. కాగా క్యాబినెట్‌ సమావేశానికి ముందు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ ఉపసంఘం, ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్‌ ఉపసంఘం భేటీ కానున్నది. ఈనెల 19న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు లోక్ సభ సచివాలయం ఇప్పటికే బులిటిన్‌ విడుదల చేసింది. పార్లమెంటు సమావేశాల తొలి రోజే బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.