ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. సుష్మా స్వరాజ్ భవన్ లో ప్రధాని అధ్యక్షతన జరగనున్న కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది.
సహజంగా ప్రతి బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం, నాలుగైదు నెలలకొసారి మంత్రి మండలి సమావేశం కానుంది. పెహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్, ఈ నెల 9తో మూడోసారి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుండటం, కేంద్రంలో ఎన్ డి ఎ ప్రభుత్వం 11 ఏళ్ళ పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది.
సమావేశంలో కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులు సహా వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. గత సంవత్సర కాలంలో తమ శాఖల ప్రగతి నివేదికలను సమావేశం ముందుంచనున్నారు మంత్రులు. పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు, ప్రజలకు మరింత చేరువవ్వడంపై మంత్రిమండలికి దిశానిర్దేశం చేయనున్నారు మోడీ.
Also Read:నిలకడగా బొత్స ఆరోగ్యం

