- Advertisement -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు.
దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఉభయ సభలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో విధానపరమైన అంశాలు, పెండింగ్‌లో ఉన్న చట్టాలు, రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
వర్షాల కాల పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రెసిడెంట్ జోక్యంపై తదితర అంశాలను ప్రతిపక్షాలు లెవనెత్తనున్నాయి. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read:కేంద్రమంత్రి మండలి సమావేశం
- Advertisement -

