ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు సమాచారం. 19-20 మంది కొత్త వారికి కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌తోపాటు బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లామ్,మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ అప్నాదళ్ చీఫ్ అనుప్రియా పటేల్,అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్,ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరథ్ సింగ్ రావత్,మహారాష్ట్ర మాజీ సీఎం నాయరణ్ రాణే,బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ,జేడీయూ ఎంపీ సంతోష్ కుమార్ కుశ్వాహ,జేడీయూ నేత ఆర్సీపీ సింగ్, ఢిల్లీ మాజీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్,హుగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ,లడఖ్ ఎంపీ జామ్యాంగ్ తెషేరింగ్ నంగ్యాల్, మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడంలో కీలక భూమిక వహించిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా సహా 19-20 మంది కొత్త వారికి మోదీ కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.