గొల్డ్ టైమ్ ఇన్‌ పిక్చ‌ర్స్… ‘ఉండిపోరాదే’

293
undiporade

త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు హీరోహీరోయిన్స్ గా ప‌రిచ‌యం అవుతూ శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి స‌మ‌ర్ప‌ణ లో గొల్డ్ టైమిన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై డాక్ట‌ర్ లింగేశ్వ‌ర్ నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రానికి ఉండిపోరాదే.. అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్ లో అసోసియెట్ ద‌ర్శ‌కుడి గా ప‌నిచేసిన న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్ప‌టికే రాజ‌మండ్రి, ఆత్రేయ‌పురం ప‌రిస‌ర ప్రాంతాల్లో మెద‌టి షెడ్యూల్ షూటింగ్ ని పూర్త‌చేసుకుంది. సంక్రాంతి సంద‌ర్బంగా ఈ చిత్రం టైటిల్ ని మెద‌టి లుక్ ని విడుద‌ల చేసారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత డా. లింగేశ్వ‌ర్ మాట్లాడుతూ.. క‌థ స్ట్రాంగ్ గా వుంటే క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టులు వుంటే.. ఆ క‌థ‌ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు వుంటే కొత్త పాత అనే తేడా చూపకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఇదే బేస్ చేసుకుని చ‌క్క‌టి క‌థ‌ని మా బ్యాన‌ర్ లో తెరకెక్కిస్తున్నాము. న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌కుడు, త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య లు జంట‌గా క‌నిపిస్తారు. ఈ చిత్రానికి ఉండిపోరాదే అనే చ‌క్క‌టి టైటిల్ ని ఖ‌రారు చేశారు. సంక్రాంతి సందర్బంగా మా చిత్రం మెద‌టి లుక్ కి విడుద‌ల చేశాము. రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో మెద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసాము.అలాగే మా తదుప‌రి షెడ్యూల్ ని ఈ నెల 28 నుండి బెంగుళూరు, మైసూర్‌, క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏక‌ధాటిగా చిత్రీక‌రిస్తాము. మా చిత్రంలో త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య , కెధార్ శంక‌ర్‌, స‌త్య కృష్ణ‌న్‌, సిధ్ధిక్షా, అల్లు ర‌మేష్‌, నారి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.మా చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆద‌రిస్తుంది. అని అన్నారు..

undiporade movie updates

నిర్మాత‌.. డా.లింగేశ్వ‌ర్ న్యూమ‌రాల‌జిస్ట్‌,స‌మ‌ర్ప‌ణ‌.. శ్రీమ‌తి స‌త్య ప్ర‌మీల క‌ర్ల‌పూడి,ద‌ర్శ‌క‌త్వం.. న‌వీన్ నాయని,సంగీతం– సాబు వ‌ర్గీస్‌,పాట‌లు– సుద్దాల అశోక్ తేజ్‌, చంద్ర‌బోస్‌, రామాంజ‌నేయులు,కెమెరామెన్‌– శ్రీను విన్నకొట‌,మాట‌లు– సుబ్బ‌రాయుడు,కొరియోగ్రాఫ‌ర్‌– న‌రేష్ ఆనంద్‌,స్టంట్స్‌– రామ్ సుంక‌ర‌,ఆర్ట్‌–క్రిష్ణా,స్టిల్స్‌– ధ‌ర్మా బ్ర‌ద‌ర్స్‌,పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను,ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్‌– కొండ నాయుడు,కొ-డైర‌క్ట‌ర్‌– శ్రీహ‌రి కొట సుధాక‌ర్‌,డైర‌క్ష‌న్ డిపార్ట్‌మెంట్‌.. చందు, శేఖ‌ర్‌, వెంకి మునిరాజ్‌