తొలి వ‌న్డే.. సెంచ‌రీ చేసిన రోహిత్ శ‌ర్మ‌

160
Rohit Century

సిడ్నీ లో భార‌త్ ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌ర‌గుతున్న మొద‌టి వ‌న్డేలో టీంఇండియా ఓపెన‌ర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేశాడు. 110 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేశాడు. మొత్తం 4సిక్స్ లు, 7 ఫోర్ల‌తో నిధానంగా ఆడుతున్నాడు. ఆసీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. 289ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇండియా ఆట‌గాళ్ల‌కు మొద‌ట్లోనే కీల‌క వికెట్ల‌ను కొల్లోయింది.

ఓపెన‌ర్ ధావ‌న్, అంబ‌టి రాయుడు డ‌కౌట్ కాగా, విరాట్ కోహ్లి మూడు ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ధోని, రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి నిధానంగా ఆడుతూ ప‌రుగులు చేస్తున్నారు. 51 పరుగులు పూర్తి చేసిన ధోని బెహ్రెన్డెర్ఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్ సన్ 3 వికెట్లు తీయగా, బెహ్రెన్డెర్ఫ్ రెండు వికెట్లని పడగొట్టాడు.