49వ సీజేఐగా ఉమేశ్‌ లలిత్..!

52
cji
- Advertisement -

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పేరును సిఫార్సు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ఈ నెల 26తో ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ముగియనుంది. దీంతో భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూ.యూ లలిత్ పేరును సిఫార్సు చేశారు.

అయితే లలిత్ పదవీకాలం నవంబర్‌ 8 వరకే ఉంది. సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం లలిత్‌ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. జస్టిస్‌ లలిత్‌ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్‌ న్యాయవాది.

- Advertisement -