బిగ్ బాస్ 5…ఉమా ఔట్

133
uma
- Advertisement -

అంతా ఊహించినట్లుగానే జరిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రెండో వారంలో ఇంటి నుండి ఉమాదేవి ఎలిమినేట్ అయింది. చివరగా ఎలిమినేషన్లో నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ఉండగా గన్ ఫైర్‌లో భాగంగా ఉమాదేవి ఎలిమినేట్ అయింది. ఇక ఎలిమినేషన్ నుండి సేఫ్ కావడంతో నటరాజ్ మాస్టర్ కన్నీటి పర్యంతం అయ్యారు. తాను ఎలిమినేట్ అయి ఉంటే బిగ్ బాస్‌లోకి వచ్చిన దానికి అర్ధం ఉండేది కాదని బాధపడిపోగా ఇంటి సభ్యులు ఓదార్చారు.

ఇక ఎలిమినేషన్ అయిన ఉమాదేవి బయటకు నవ్వుతూ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె బిగ్ బాస్ జర్నీని చూపించిన నాగ్…ఆమెను థ్రిల్ చేశారు. తర్వాత ఇంట్లో ఉన్న 17 మంది సభ్యుల్లో 8 మంది గురించి చెప్పమని అడగ్గా ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది. ఎదుటి వారి రియాక్షన్లను కూడా పట్టించుకోవాలి అంటూ సిరికి సలహా ఇచ్చిన ఉమా…. ఎవరి ఆట వాళ్లు వారే ఆడుకోవాలి అని తెలిపింద. ఇక లహరి ఇంట్లో చాలా వీక్ అని.. ఎవరి సాయం తీసుకోకుండా ఆడు అంటూ లహరికి సూచించింది.

ప్రియ సేఫ్‌గా ఆడుతోందని …షన్ను బేటా అంటూ నీ గేమ్ నువ్ ఆడుకో అంటూ సలహా ఇచ్చింది. సిరి నీకు కేవలం ఫ్రెండ్ మాత్రమే.. అది నీకు ప్లస్ అవుతుంది.. మైనస్ అవుతుంది అని తెలిపింది. ఇక రవికి చురకలు అంటించింది. అందరినీ దగ్గర తీసుకునే క్రమంలో మిగతా వారికి దూరం అవుతున్నావేమో అని తెలపగా ఐ మిస్ యూ భంగు.. మన గురించి ఎంతో మంది ఎన్నో అనుకుంటారు.. కానీ మనం ఏంటో మనకు తెలుసు అంటూ లోబో గురించి చెప్పింది. ఇక అనీ మాస్టర్ …ఏదైనా గొడవ జరిగితే తొందరగా రియాక్ట్ అవుతున్నారు.. ఎక్కడ పాయింట్ అనిపిస్తే అక్కడే రైజ్ అవ్వండని సలహా ఇచ్చిన ఉమా…నటరాజ్ మాస్టర్ గురించి ఆటని ఆటలా ఆడాలని .. అలానే ఆడండి.. అప్పుడు మీరు వేరే లెవెల్‌లో ఉంటారు అని తెలిపింది.

- Advertisement -