- Advertisement -
ఉక్రెయిన్ – రష్యా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కొల్పోతుండగా తాజాగా రష్యా జరిపిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు.
భారత విద్యార్థి నవీన్ ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో అక్కడి గవర్నర్ హౌస్/సిటీ హాల్‌పై రష్యా మిలటరీ మిస్సైల్ దాడి జరిపింది. దీంతో ఈ దాడిలో నవీన్ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థుల తరలింపు కొనసాగుతునే ఉంది. ఇప్పటికే పలు విమానాల్లో భారతీయ విద్యార్ధులను వారి స్వస్థలాలకు తరలించిన సంగతి తెలిసిందే.
- Advertisement -