నా చావును కోరుకుంటున్నారు..మోడీ సంచలన వ్యాఖ్యలు!

45
pm
- Advertisement -

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తినడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ముగిసిన నాలుగు విడతల పోలింగ్‌లో యోగి సారథ్యంలోని బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయిందని, అఖిలేష్ యాదవ్ సారథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ ముందంజలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాషాయపెద్దలు ఆందోళనలో పడ్డారు. ప్రధాని మోదీ, అమిత్‌‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర అగ్రనేతలు యుపీ ప్రచార బరిలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలోని మోదీ సర్కార్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే…దీంతో అప్రమత్తమైన మోదీ యుపీలో కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర‌్శలు చేశారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని… చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారు అంటూ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రధాని మోడీ విమర్శలు చేశారు.. గతేడాది ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. ఈ పర్యటన గురించి అప్పట్లో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానం చెబుతూ..మంచిదే..ఒక రోజు కాదు…మూడు నెలలైనా వారణాసిలో ఉండొచ్చు. అలా ఉండడానికి అది పూర్తి అనువైన ప్రదేశం. ఎందుకంటే చివరి రోజుల్లో అందరూ వారణాసిలోనే గడపాలని కోరుకుంటారంటూ అఖిలేష్ వ్యాఖ్యానించారు.

కాగా తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో అఖిలేష్ వివరణ ఇచ్చారు. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయనే ఉద్దేశంలో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా అఖిలేష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కొందరు నేతలు పూర్తిగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఏకంగా నా చావును కూడా కోరుకుంటున్నారు. అదీ వారణాసిలో కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేను ఆనందంగా ఉన్నా…వారణాసి ప్రజలతో చివరి వరకు జీవించే అవకాశం దక్కుతున్నందుకు…ప్రాణం పోయే వరకు వారికి సేవ చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది అంటూ మోదీ చెప్పుకొచ్చారు. కాగా మోదీ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. యుపీలో ఓడిపోతామనే భయంతోనే ప్రధాని మోదీ… కొందరు తన చావును కోరుకుంటున్నారంటూ…గతంలో అఖిలేష్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ…ప్రజల్లో భావోద్వేగాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్లుగా యుపీకి ఏం చేసామో చెప్పకుండా గతంలో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఇలా రాజకీయంగా వాడుకుంటున్న మోదీ గారి చావు తెలివితేటలకు హ్యాట్సాఫ్ అని ఎస్పీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

- Advertisement -