కరోనా వ్యాక్సిన్…. శుభవార్త చెప్పిన ఫైజర్

266
pizer
- Advertisement -

కరోనాపై పోరులో శుభవార్త చెప్పింది ఫైజర్ కంపెనీ. ఈ నెల 7 నుండి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఫైజర్. ఇందుకు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించింది.

ముందుగా 80ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తరువాత కరోనా వారియర్స్ కు, అనంతరం మిగతా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. యూకేలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వ్యాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే ఫైజర్ సంస్థ అమెరికన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అమెరికా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

- Advertisement -