రిపబ్లిక్‌ డే వేడుకకు ముఖ్య అతిథి యూకే ప్రధాని..

88
uk pm

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే 2021వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ సారి ముఖ్య అతిథిగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. ప్రధాని మోదీ నవంబర్ 27న బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో సంభాషించారు. 2021 భారత గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయణ్ని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆహ్వానాన్ని యూకే ప్రధాని అంగీకరించినట్లు యుకే విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ వేడుకలకు బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నారు.