విద్యుత్ పొదుపులో ప్రజల్లో చైతన్యం రావాలి: మంత్రి

47
Jagadish Reddy

విద్యుత్ ను పొదుపు చెయ్యడంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా ఆర్థిక వెసులుబాటుతో పాటు పర్యావరణ పరిరక్షణ సులబతరమౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రేనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఆయన జూమ్ కెమరా ద్వారా ప్రారంభించారు. అదే విధంగా ఆ సంస్థ రూపొందించిన సావనిర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్ మీద ఆధారపడిన ప్రపంచం ఇప్పుడిప్పుడే సాంప్రదెయతర విద్యుత్ వైపు చూస్తున్నారన్నారు. అందులో తెలంగాణా రాష్ట్రము ఇప్పటికే ముందున్నదని ఆయన స్పష్టం చేశారు.

అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో చాలా ముందు ఉన్నారన్నారు.ఉద్యమ కాలంలోనే విద్యుత్ పొదుపు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే హితబోదను మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందు ఉన్న ఛాలెంజ్ విద్యుత్ పొదుపు అని అందుకు అనుసరించాల్సిన పద్ధతులను ప్రజల్లోకి ఉద్యమంలా తీసుకు పోవాలని ఆయన కోరారు. 2014 కు ముందు మొక్కలు నాటడం అంటే అటవీశాఖకు మాత్రమే పరిమితం అయి ఉండదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా మార్చారని ఆయన గుర్తుచేశారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డ శ్రమ అని ఆయన కొనియాడారు.

విద్యుత్ వినియోగం మానవ జీవితంలో భాగమైందని అటువంటి విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ పొదుపు విషయంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, రెడ్కో వంటి సంస్థలు చొరవ చూపి పని చేస్తున్నాయని ఇది ప్రజా ఉద్యమంలా ముందుకు పోతే లక్ష్యసిద్ధి సుసాధ్యం కష్ట తరం కాబోదు అన్నారు.ఐ ఇ ఐ చైర్మన్ రామేశ్వర్ రావు కో ఆర్డినెట్ చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖా కార్యదర్శి సందీప్ సుల్తానీయ,రెడ్కో చైర్మన్ ఎన్ జానయ్య ,ఎనర్జీ కనసర్వేషన్ చైర్మన్ ఇ. శ్రీనివాస చారి,కన్వీనర్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.