మెగాస్టార్‌కు ఘన సత్కారం

6
- Advertisement -

యూకే పార్లమెంట్ లో మెగాస్టార్ చిరంజీవికి ఘన సత్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కు మెగాస్టార్ చిరంజీవిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో యూకే పార్లమెంట్ లో అధికార లేబర్ పార్టీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చిరంజీవిని సత్కరించి ఈ అవార్డు ఇచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

చిరు తన సినిమా కెరీర్‌లో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో ఆడియన్స్‌ని అలరించినందుకు గాను చిరంజీవికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇటీవలె కేంద్రం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక గతేడాది ఏఎన్‌ఆర్‌ జాతీయ పురస్కారం కూడా గతేడాది అందుకున్నారు.

 

Also Read:ఆరు గ్యారెంటీలు..గోవిందా: కేటీఆర్

- Advertisement -