- Advertisement -
తమిళనాడు మంత్రివర్గంలో మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం స్టాలిన్. డిసెంబర్ 14న ఉదయం 9.30 గంటలకు కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ సారి మంత్రివర్గంలో చేరనున్నారు స్టాలిన్ తనయుడు ఉదయనిధి.
ప్రస్తుతం డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా, చెపాక్ – తిరువల్లికేని నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఉదయనిధి. ఉదియనిధి మంత్రివర్గంలోకి చేరుతారని రాజ్‌భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించడంతో స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఏడాదిన్నర అనంతరం క్యాబినెట్‌లో మార్పులు జరుగుతున్నాయి. తన తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్-తిరువల్లికేనీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేసి విజయం సాధించారు. డీఎంకే స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -